కేసీఆర్ నీకాల్మొక్కుతా : గద్దర్

ప్రత్యేకతెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఛైర్మన్ గద్దర్‌కు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. కానీ గద్దర్ ఆసక్తికరంగా కేసీఆర్ కాలు మొక్కైనా సరే ఆయనను ఒక విషయంలో తప్పక ఒప్పిస్తానని గద్దర్ అంటున్నారు. అదేమిటంటే టీఆర్‌ఎస్‌ను కనుక విలీనం చేస్తే తెలంగాణ తప్పక ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించే పక్షంలో కేసీఆర్ కాల్మొక్కైనా సరే ఒప్పిస్తానని గద్దర్ నల్గొండ జిల్లా పర్యటనలో ప్రకటించారు. గతంలో తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లకు పాదాభిషేకం చేస్తానని కేసీఆర్ ప్రకటించగా, ఇప్పుడు గద్దర్ అదే బాటలో కేసీఆర్‌ను ఒప్పిస్తానంటున్నాడు. కానీ టీఆర్‌ఎస్ విలీనంపై ఆ పార్టీనేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గద్దర్ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ఇరుకున పెట్టే యత్నంలోనే ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!