నేలరాలిన తారలు


తెలుగు చిత్రరంగంలో వెలుగొందిన తారలు రాలిపోతున్నాయి. ఇక ఆ వెలుగులు మనమిక చూడలేమన్న బాధ గుండెల్లో గుడుకట్టుకుంటోంది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణవార్త వినడానికి ముందే మన గుండె రాయిగా మారిపోయింది.
 వారం రోజుల ముందే జనవరి 13న అంజలీదేవి (తెలుగువారి సీతమ్మతల్లి) కన్నుమూశారు. 2013 అక్టోబర్ 10- గురువారంనాడు ఓ మంచి నటుడ్ని మనం కోల్పోయాము. ఆయనే శ్రీహరి.

 ఆ తర్వాత నవంబర్ 8వ తేదీ (శుక్రవారం) ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం  (అదేనండీ ఏవీఎస్ గారు) కన్నుమూశారు. డిసెంబర్ 7 శనివారం రాత్రి మరో హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు మననుంచి దూరమయ్యారు. ఈ ఏడాది మెదటినెల (జనవరి) ఆరవ తేదీన యువ హీరోకిరణం - ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారం గడవకముందే చెన్నైలో అంజలీదేవి తుదిశ్వాస విడిచారు. ఇక ఇప్పుడు మహానటుడు ఏయన్నార్ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!