20, డిసెంబర్ 2015, ఆదివారం

లౌక్యం తెలియని లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు తన సుపుత్రుడు లోకేశ్ కి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పూర్తిగా అప్పజెప్పి పప్పులో కాలేశారా ? రాజకీయ లౌక్యం అంతగా తెలియని లోకేశ్ మాట పార్టీ నాయకులు వినే పరిస్థితి ఉన్నదా ?

  తాజా పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ కేవలం భయం, అనుమానం మాత్రమేనని కొట్టిపారేయలేం. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు తన శక్తుయుక్తులు ధారబోసి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకువచ్చారు. అధికారం చేజిక్కడంతో  ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నమాట వాస్తవమే. ఒకప్పుడు తెలుగుదేశం జెండా ఎగరని గ్రామాల్లో ఇప్పుడు పచ్చజెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్ ఫోటోలకు బదులుగా చంద్రబాబు ఫోటోలు కనిపించే స్థితి చాలా గ్రామాల్లో వచ్చింది. అధికార పార్టీలో ఉంటే ఎంతోకొంత లాభం పొందవచ్చన్న ప్రాధమిక సూత్రమే ఇందుకు కారణం కావచ్చు. లేదా,  నవ్యంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడంపట్ల చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం కూడా కావచ్చు. రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతోంది. అప్పటివరకు ఇతర పార్టీలను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభించారు. దీంతో  తెలుగుదేశానికి ఏపీ కంచుకోటగా మారుతోంది.
(పూర్తి వ్యాసం కోసం లింక్ నొక్కండి)

https://www.telugu360.com/te/is-lokesh-real-leader/

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి