జగన్ పై ప్రత్యర్థి కావలెను
కడప లోక సభ స్థానం నుంచి జగన్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల కోసం గాలిస్తోంది .జగన్ ను ఎలాగైనా ఓడించాలని తపన పడుతున్న కాంగ్రెస్ కి సరైన అభ్యర్దులే దొరకడం లేదు .వేరే పార్టీ నుంచి ఎవరైనా ముందుకొస్తే వారికీ టికెట్ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పై పదేపదే విమర్శలు చేస్తోన్న డీఎల్ లాంటి నేతలను బరిలోకి దింపాలనుకున్నా వారు ముందుగానే చేతులు ఎత్తేసారు .టీడీపీ పరిస్తితి కూడా దాదాపుగా అంతే. కాగా నిన్నటి వరకు వైఎస్ జగన్ పై పోటీగా వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం సాగింది. మంత్రి వివేకానందరెడ్డి కూడా అల్లుడిని వెంట బెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలసివచ్చారు. అయితే అధిష్టానం నర్రెడ్డి కి టికెట్ ఇచ్చేందుకు అంత సుముఖంగా లేదు .ఉప ఎన్నికల్లో మంత్రి వివేకానందరెడ్డి, జగన్మోహన్రెడ్డి మధ్య చివరి నిముషంలో లోపాయికారి ఒప్పందాలు కుదురుతాయేమోనన్న అనుమానం అధికార పార్టీలో కలి...