
ప్రియమైన మిత్రులారా… వృత్తి పరంగా మార్పులు రావడం సహజమే. ఈ మధ్య అనారోగ్యం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను తిరిగి నా జర్నలిజం కెరీర్ పై దృష్టిపెట్టాను. ఈ మార్పులు సంభవిస్తున్న కాలంలోనే నా కెరీర్ మలుపు తిరిగింది. (పైన రాసిన లేఖ, తరంగ మీడియా చైర్మన్ మోహన్ మురళీధర్ గారు రాసింది) ప్రవాసఆంధ్ర మిత్రులు అందించిన ప్రోత్సాహంతో నేను తరంగ మీడియాలో న్యూస్ అండ్ ప్రొగ్రాం డైరెక్టర్ గా చేరాను. అంతవరకు టివీ 5 న్యూస్ ఛానెల్ లో పనిచేస్తూ ఎంతో మంది మిత్రుల ఆత్మీయఅనుబంధాన్ని పెంచుకున్నాను. దీనికంటే ముందు తెలుగువన్.కామ్, అలాగే, ఆంద్రప్రభ, ఇంకా వెనక్కి వెళితే ఈనాడు (1983)లో ఎంతో మంది మిత్రులతో కలిసిపనిచేసే భాగ్యం లభించింది. అలాగే, ఆకాశవాణితో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మరువలేనిది. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మిత్రులే నాకున్న నిజమైన బలం. వారిందిస్తున్న ప్రోత్సాహంతోనే ఇప్పుడు నేను రేడియో తరంగ (ఆన్ లైన్ రేడియో)లో సోమవారం నుంచీ శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచీ 9 గంటల వరకు వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని లైవ్ షోగా ఇస్తున్నాను. ఈ లింక్ లు చూడండి… http://tharangamedia.com/ http://thar...