జ‌గ‌న్ అరెస్టు త‌ప్పదా..?


వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు, జగతి పబ్లికేషన్స్ వైయస్ చైర్మన్ విజయసాయి రెడ్డి తర్వాత అరెస్టు ఎవరిదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొద్ది కాలంగా వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు మందగించినట్లు కనిపించినప్పటికీ విజయసాయి రెడ్డి అరెస్టుతో అకస్మాత్తుగా వాతావరణం వేడిక్కెంది. తదుపరి అరెస్టులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. విజయసాయి రెడ్డి తర్వాత కేసులో ప్రథమ ముద్దాయి వైయస్ జగన్ అరెస్టు అవుతారంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ధైర్యం చేసి రాసింది. అరెస్టుల వరుసలో జగన్, వ్యాపారవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప రెడ్డి ఉంటారని ఆ పత్రిక అంచనా వేస్తూ రాసింది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విజసాయి రెడ్డి పెట్టుబడుల రూపంలో వైయస్ జగన్ కంపెనీలకు లంచాలు రాబట్టడానికి మధ్యవర్తిగా వ్యవహరించారని సిబిఐ ఆరోపణ. విజయసాయి రెడ్డి వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు కాగా, జగన్ తొలి నిందితుడు, నిమ్మగడ్డ ప్రసాద్ 12వ నిందితుడు. జగన్ కంపెనీలకు పెట్టుబడుల రూపంలో లంచాలు రాబట్టడంలో విజయసాయి రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారని తమ వద్ద సాక్ష్యాలున్నాయని సిబిఐ అంటోంది. జగన్‌తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప రెడ్డివంటివారితో మిలాఖత్ అయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ అధికారులు అంటున్నారు. సిబిఐ ఆరోపణల ప్రకారం – నిమ్మగడ్డ ప్రసాద్ జగతిలో రూ. 100 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ. 244 కోట్లు, కార్మెల్ హోల్డింగ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 20 కోట్లు, సండూర్ కంపెనీ లిమిటెడ్‌లో రూ. 140 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీలన్నీ జగన్‌కు చెందినవే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!