సిఎం నూత‌న సంవ‌త్సర కానుక‌లు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు కొన్ని వరాలు కూడా ఇచ్చారు.ముఖ్యంగా రాష్ట్రం అంతటా ప్రజలు ఎదుర్కుంఉటన్న కరెంటు కోతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ సమన్వయ కేంద్ర కన్వీనర్ ఎ. చంద్రశేఖరరెడ్డి ప్రకటిస్తూ గ్రామలలో నాలుగు గంటల సేపే కరెంటు కోత ఉంటుంది. అలాగే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు గంటలే కోత విధిస్తారు.అలాగే మరో వరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.ఎపిపిఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల వయో్ పరిమితిని మరో రెండేళ్లపాటు సడలించారు.దీనివల్ల వేలాది మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కాగలుగుతారు. ఇక మున్సిపల్ లే అవుట్ల క్రమబద్దీకరణ కు మరో సారి ఉత్తర్వులు జారీ అయ్యాయి.అయితే ఇది ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకునే ప్రక్రియలో భాగంగా జరిగిందన్న భావన కూడా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!