ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలకు ఒక స్పష్టమైన సమాచారం అందినట్లుగా ఉంది.తెలంగాణ ఉద్యమంలో గతంలో కాస్త తీవ్రంగానే మాట్లాడిన ఒక ఎమ్.పి ఇప్పుడు తెలంగాణపై నిర్ణయం జరగదని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోదని తమకు సమాచారం ఉందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి, కాంగ్రెస్ హై కమాండ్ కు సమస్యలు వస్తున్నాయని, తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయానికి ఉత్తరప్రదేశ్ లో మాయావతి ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలు చేయాలంటూ శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా కొత్త తలనొప్పి తెచ్చారని,దాంతో ఈ అంశం ఇప్పుడు వెనకబడినట్లయిందని ఆ ఎమ్.పి చెప్పారు. కాగా తెలంగాణ రీజినల్ కమిటీ లేదా బోర్డు వంటివి కూడా ఇప్పట్లో ఏర్పాట్లు కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా మంత్రులు, ఎమ్.పిలు, ఎమ్మెల్యేలే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని మరో సీనియర్ నాయకుడు చెప్పారు. ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఫర్వాలేదుకాని, బోర్డు వేస్తే మాత్రం తాము ఇబ్బందిలో పడతామని కొందరు తెలంగాణ మంత్రులు కూడా కేంద్ర నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారని, దీనితో ఆ ప్రతిపాదన కూడా వెనకబడిందని తెలంగాణ నాయకుడు ఒకరు అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!