చిరంజీవికి మంత్రిప‌ద‌వి రాదా..?


మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందా?దానికి కారణం తిరుపతి గండం కారణంగా చెబుతున్నారా? కాంగ్రెస్ వర్గాలలో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కచ్చితంగా చిరంజీవి కేంద్రంలో మంత్రి అవుతున్నారని చెబుతుండగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీర శివారెడ్డి మాత్రం చిరంజీవి రాష్ట్ర రాజకీయాలలోనే ఉంటే బాగుంటుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న వీరశివా ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ వ్యాఖ్య చేసి ఉంటారా అన్న సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అటు ముఖ్యమంత్రికి, ఇటు వీరశివకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన నేత,ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం ఒక లక్ష్యంగా కనిపిస్తుంది., చిరంజీవి రాజ్యసభకు వెళితే తిరుపతి సీటు ఖాళీ అవుతంది.అప్పుడు జరిగే ఉప ఎన్నిక ప్రతిష్టాత్మక అవుతుంది. పైగా అది ముఖ్యమంత్రి సొంతదైన చిత్తూరు జిల్లా కావడంతో దాని ప్రభావం రాజకీయంగా చాలా ఉంటుంది. తిరుపతి సీటు గెలిస్తే ఫర్వాలేదు. అందుకు భిన్నమైన ఫలితం వస్తే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి సీటుకు రిస్కు తీసుకోవాలా అన్నది ముఖ్యమంత్రి శిబిరం ప్రశ్నగా ఉంది. అందువల్ల చిరంజీవికి రాష్ట్రంలో బాధ్యతలు అప్పగిస్తే ప్రస్తుతానికి బెటర్ కదా అన్నది వారి వాదనగా ఉంది.ఈ నేపధ్యంలో చిరంజీవిని కేంద్రంలో కాకుండా రాష్ట్రానికే పరిమితం చేస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. కాని కాంగ్రెస్ హై కమాండ్ హామీ ఇచ్చి దానిని ఉల్లంఘిస్తుందా అన్నది కూడా చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!