12-12-12 ర‌జ‌నీకి స్పెష‌ల్ డే


సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడు తున్నారా? అయితే ఈ ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే. ‘రజనీకాంత్’ పేరుతో ఆయన జీవిత చరిత్రను వివరిస్తూ సినీ నిర్మాత, విమర్శకుడు నామన్ రామచంద్రన్ రాసిన పుస్తకం రజనీ స్టైలులో 12.12.12న విడుదల కానుంది. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012, డిసెంబర్ 12న ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రజనీకాంత్‌తో రామచంద్రన్ సంభాషించి.. సమగ్ర వివరాలతో రాసిన తొలి ప్రామాణిక పుస్తకమిది కావడం గమనార్హం. దీంతో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. రజనీ సినీ రంగ అరంగేట్రం నుంచి మొదలుకుని ఈ ఏడాది రాబోతున్న రాణా సినిమా వరకు సంబంధించిన విశేషాలతో ఈ పుస్తకం అలరించనుందని పబ్లిషర్లు అయిన పెంగ్విన్ బుక్స్ ఇండియా వారు చెబుతున్నారు. రజనీకాంత్‌కు సంబంధించి గతంలో ఎన్నడూ బయటకు రాని ఎన్నో సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయంటూ ఊరిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!