సూర్యుడికి భూమి ద‌గ్గర‌య్యింది..


ఈరోజు సూర్యుడిని గమనించారా? రోజూ కంటే మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు కదూ! ఎందుకంటే.. నేడు ‘పెరిహీలియన్ డే’ మరి. అంటే భూమి సూర్యుడికి అత్యంత సమీపదూరంలోకి వచ్చే రోజన్నమాట. ఏటా జనవరిలో మాత్రమే ఈ దృగ్విషయం చోటుచేసుకుంటుందని బుధవారం ఢిల్లీలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రఘునందన్ కుమార్ వెల్లడించారు. ‘సాధారణంగా గ్రహాలు, గ్రహ శకలాలన్నీ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. భూగ్రహం కూడా ఇలా కక్ష్యలో తిరుగుతూ ఏడాదికి ఒకసారి సూర్యుడికి అతిదగ్గర బిందువు (పెరిహీలియన్) వద్దకు, మరోసారి ఏటా జూలైలో అతిదూరపు బిందువు(అప్‌హీలియన్) వద్దకు చేరకుంటుంది’ అని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం 5:53 గంటలకు భూమి పెరిహీలియన్ బిందువు వద్దకు చేరుకుంటుందని, ఆ సమయంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం అతితక్కువగా 147 మిలియన్ల కిలోమీటర్లు(14.70 కోట్ల కి.మీ.) మాత్రమే ఉంటుందన్నారు. అయితే సూర్యుడు దగ్గరగా వచ్చినప్పటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవని, భూమి ఉష్ణోగ్రతలు సూర్యుడి దూరం మీద కాకుండా భూ అక్షం ఉన్న కోణం మీద ఆధారపడి ఉంటాయని తెలిపారు. అప్‌హీలియన్ వద్ద భూమికి, సూర్యుడికి దూరం అత్యధికంగా 15.20 కోట్ల కి.మీ. ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!