న‌ర‌సింహ‌న్ ‘ఘ‌నుడే’


రాష్ట్ర గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ పోలీసు విభాగం నుంచి వచ్చినవారు. ఆయన దేశంలోనే అత్యున్నతమైన ఇంటిలెజిన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసి కేంద్ర స్థాయిలో ఉన్న ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు. ఆయన తన పదవీ విరమణ తర్వాత చెన్నైలో స్థిరపడడానికి అన్నీ సర్దుకుని సిద్దమైన తరుణంలో చత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమితులైనట్లు వర్తమానం వచ్చింది. తదుపరి ఆయన అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉండగా ఆయన ఇక్కడ గవర్నర్ గా బాద్యతలు చేపట్టారు. ఆ దశలో మొత్తం ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతారన్నంతగా ప్రచారం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలు కూడా తరచూ నరసింహన్ ను కలిసి సంప్రదింపులు చేస్తుంటారు. కొన్ని సార్లు అయితే డిజిపి పదవిలో ఉన్నవారు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడుతుంటారు. అదే సమయంలో ఆయా ప్రత్యేక సందర్భాలలో రాజకీయ పక్షాల నేతలందరితోను గవర్నర్ కలుస్తుంటారు. అలాగే చిరంజీవితో ప్రత్యేకంగా చర్చలు జరిపిన ఘట్టాన్ని కూడా గుర్తు చేస్తుంటారు. ఈ నేఫధ్యంలో అటు బ్యూరో క్రాట్ గా, ఇటు రాజకీయ నాయకుడిగా అందరితో ఎలా వ్యవహరిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే నరసింహన్ భలే చమత్కార సమాధానం ఇస్తున్నారు. “నా పేరులోనే ఉంది. నర -సింహన్ ‘అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.నరుడుగా అంటే రాజకీయ నాయకుడిగా, సింహన్ గా ఉంటే పోలీసు అధికారిగా ఒకేసారి రెండు పాత్రలు పోషింగలను సుమా అని నర్మగర్భంగా ఆయన సమాధానం చెబుతున్నతీరు విన్నవారిని సహజంగానే ఆకట్టుకుంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!