అంద‌రూ అరెస్టు అవుతార‌ట‌


సమయం వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సహా అందరూ అరెస్టవుతారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఉప ఎన్నికల కోసం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని అరెస్టు చేశారనడంలో నిజం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్‌తో బేరసారాలు ఆడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుల తీరుతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. ఉద్యమం వల్ల నాయకులు లాభపడ్డారని, ప్రజలు నష్టపోయారని ఆయన అన్నారు. ప్రజలకు నష్టం జరగకుండా ఉద్యమాలు చేస్తే ఎవరూ వ్యతిరేకించబోరని ఆయన అన్నారు.
మైలవరంలో మద్యం షాపులన్నీ తెలుగుదేశం పార్టీవారివేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుచరులే సారా అమ్ముతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లతో అన్ని పార్టీలకు చెందినవారు ఉండవచ్చునని ఆయన అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!