సైన్స్‌లో భార‌త్‌ని దాటేసింది..


శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనకంటే చైనా ముందుకు దూసుక వెళుతోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. మనకున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసుకుని అంతటితో తృప్తి చెందుతున్నామనీ, అయితే చైనా కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ ముందుకు దూసుక వెళుతోందని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో 2017 నాటికి భారత పెట్టుబడి రెండింతలు పెరుగుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఐదు రోజుల పాటు జరిగే 99వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2017వ సంవత్సరం నాటికి సాంకేతిక రంగంలో భారత పెట్టుబడి రెండింతలు పెరగాలి.
ప్రస్తుతం సాంకేతిక రంగంలో అత్యధిక పెట్టుబడి పెట్టిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో చైనా ముందంజలో ఉందని ఆయన చెప్పారు. 2017 నాటికి భారత్‌లో సైన్స్ అభివృద్ధికి పెట్టుబడులను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సదస్సులో 15వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!