సిబిఐ పై జ‌గ‌న్ ఫైర్‌


జగన్ ఆస్తుల కేసు ఎఫ్‌.ఐ.ఆర్. లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పేరు బదులుగా రాజశేఖరరెడ్డి పేరు చేర్చడాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దీనినిబట్టే కేసు ఎలా నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎలా కోరుకుంటున్నాయో అలాగే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సిబిఐ మారిందని ఆయన ద్వజమెత్తారు. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తాను కాంగ్రెస్ లో ఉండి ఉంటే సిబిఐ విచారణ వచ్చి ఉండేదా అన్న ప్రశ్నను ఆయన వేశారు. కొన్ని విలువలకు కట్టుబడి పదిహేడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టడాన్ని ఎలా తప్పు పడతారని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంతకాలం పొగిడిన కాంగ్రెస్ పెద్దలు ఆయన చనిపోయాక విమర్శలు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!