ఇంగ్లీష్ ప‌త్రిక‌పై జ‌గ‌న్ ఫైర్‌


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి టైమ్స్ ఆఫ్ ఇండియాపై విరుచుకుపడ్డారు.ఎల్లో సిండికేట్ లో భాగంగా టైమ్స్ కూడా చేరిందా అని ప్రశ్నిస్తూ ఆయన తన పత్రికలో సుదీర్ఘమైన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విలీనం కావడానికి జగన్ కాంగ్రెస్ పెద్దలతో అవగాహన కుదుర్చుకున్నారని జనవరి ఒకటో తేదీన రాసిన ఒక కధనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇదంతా ఎల్లో సిండికేట్ తప్పుడు ప్రచారమని, చంద్రబాబు నాయుడు చేయిస్తున్న తప్పుడు ప్రచారం అని, అందులో టైమ్స్ వంటి ప్రముఖ పత్రిక కూడా భాగస్వామి కావడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.అలాగే నవంబర్ పద్దెనిమిదిన తాను ఢిల్లీలో కొందరి ద్వారా రాయబారం నడిపానని రాశారని, కాని ఆ సమయంలో తాను గుంటూరు ఓదార్పు యాత్రలో ఉన్నానని జగన్ గుర్తు చేశారు. పాత్రికేయులు తేదీలు ప్రస్తావించదలచినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని ఈ ఉదంతం తెలియచేస్తుంది. అలాగే సంబంధిత వ్యక్తుల వివరణ కూడా కలిపి కూడా ప్రచురించడం సంప్రదాయంగా ఉంటుంది.భవిష్యత్తులో ఏమి జరిగినా ఇప్పుడు రాసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రాస్తే ఇలాంటి విమర్శలకు ఆస్కారం ఉండదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!