విమ‌ర్శించిన నోటితోనే ప్రశంస‌లు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలంగాణ ఎమ్.పిలు చెబుతున్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఒక ఎమ్.పి దీని గురించి మాట్లాడుతూ తాము గతంలో ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసినప్పట్టికీ, పరిస్థితులను గమనంలోకి తీసుకుని తమ వైఖరిలో మార్పు చేసుకున్నామని చెప్పారు.అయితే దీనికి రహస్య ఒప్పందాలేమీ లేవని, కేవలం పార్టీ ప్రయోజనాల రీత్యా మాత్రమే తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని తాము వదులుకోబోమని, అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా విమర్శించబోమని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు అంటూ తీవ్రంగా విమర్శించే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటే అటు ముఖ్యమంత్రి వైపు నుంచి వచ్చిన చొరవ కూడా కారణమన్న వాదన కూడా ఉంది.కొందరు ఎమ్.పిల కోర్కెలను కూడా సి.ఎమ్ ఆమోదించారని అంటున్నారు. అది కాకుండా పార్టీ అధిష్టానం కూడా దీనిపై గట్టిగా చెప్పిందని మరో అభిప్రాయం ఉంది.ఏది ఏమైనా గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళితే ఆయనను కలుసుకోవడానికి కూడా ఇష్టపడకుండా, దాదాపు బహిష్కరించినంత పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఇప్పుడు ఆయనను విమర్శించకుండా ఉండడంలోని ఆంతర్యం ఏమిటో . రాజకీయ పరిణామాలు దగ్గరగా చూస్తున్నవారు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!