ఏడు త‌రాలు ఇక్కడే..


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు మూలాలు విజయనగరంలో ఉన్నాయన్న కధనాలు విస్తారంగా ప్రచారంలోకి రావడంతో ఆయన కుమారుడు దానిని ఖండించడానికి రంగంలో దిగారు. సిరిసిల్ల శాసనసభ్యుడు, టిఆర్ఎస్ ముఖ్య నాయకుడు తారకరామరావు తమ కుటుంబానికి సంబంధించి ఏడు తరాలు తెలంగాణలోనే ఉన్నాయని , ఆ విషయాన్ని నిరూపించడానికి తాము ఆదారలతోసిద్దంగా ఉన్నామని చెప్పారు.కాగా కెసిఆర్ తాత, తండ్రి విజయనగరం జిల్లా బుడ్డిపేట లో ఉండేవారని, వ్యాపారాల రీత్యా తెలంగాణ ప్రాంతానికి వెళ్లారని అక్కడి వెలమ కుటుంబాల నుంచి సమాచారం ప్రకారం స్థానికులు, టిడిపి నాయకులు మీడియాకు చెప్పారు. అంతేకాక కెసిఆర్ పూర్వికుల ఇల్లు అంటూ ఒక ఇల్లును చూపించడం, అక్కడ కెసిఆర్ ఇంటి పేరు అయిన కలవకుంట్ల వారు కొందరు ఉండడం వంటి ఆధారాలతో కెసిఆర్ పూర్వీకులు ఉత్తరాంద్ర నుంచి వలస వచ్చారని పేర్కొన్నారు. దీనిపై వెంటనే టిడిపి నేతలు కెసిఆర్ ఆంద్ర వాడంటూ ప్రచారం ప్రారంభించి ఆంద్రకు పిలిచి సన్మానిస్తామని ప్రకటనలు ఇవ్వడం ఆరంభించారు. ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్ర ప్రసాద్,నన్నపనేని రాజకుమారి తదితరులు ఇలాంటి ప్రకటనలు చేశారు.దీనిపై కె.తారకరామారావు స్పందిస్తూ తమ పూర్వీకుల ఏడు తరాల వారు తెలంగాణలోనే జన్మించారని చెప్పారు. కాగా కెసిఆర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో తము పూర్వీకులు బీహారు నుంచి విజయనగరం, బొబ్బిలి ప్రాంతానికి, ఆ తర్వాత అక్కడ నుంచి తెలంగాణకు వలస వచ్చారని చెప్పారు. అయితే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయంగా చెప్పగా, ఇప్పుడు కెసిఆర్ తాత, తండ్రులే ఉత్తరాంద్ర నుంచి వచ్చారన్న ప్రచారం కాస్త ఇబ్బందికరంగా మారింది.మనిషి వలస జీవి అన్న ప్రాధమిక సూత్రాన్ని ఇప్పుడు అంతా ఒప్పుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!