మహిళా దుస్తులపై కర్నాటక మంత్రి కామెంట్


మనరాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి మహిళలపై అత్యాచారాల కేసులు పెరిగిపోవడానికి వారు ధరిస్తున్న దుస్తులే కారణమంటూ చేసిన వాఖ్యలు ఒక పక్క దుమారం రేపుతుంటే, మరో పక్క పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సి.సి.పాటిల్ కూడా మహిళా దుస్తులపై కామెంట్ పాస్ చేశారు. మహిళలు రెచ్చగొట్టే రీతిలో దుస్తులు వేసుకోవడం మంచిదికాదనీ, వారు హుందాగా ఉండే దుస్తులే వేసుకోవాలంటూ తన మనసులోని మాట చెప్పేశారు. పురుషుల్లో నైతిక విలువల పతనం కూడా అత్యాచారాల కేసులు పెరగడానికి ఓ కారణమని పాటిల్ అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీల్లోనూ, కాల్ సెంటర్స్ లోనూ పనిచేసే మహిళలకు తాము ఏస్థాయిలో ఒంటిని దుస్తులతో కప్పిఉంచుకోవాలో బాగానే తెలుసని పాటిల్ వ్యాఖ్యానించారు. భిన్నకులాలు, భిన్న మతాలు, సంస్కృతులు ఉన్నచోట డ్రస్ కోడ్ పెట్టడం సాధ్యంకాదంటూ కుండబద్దలుకొట్టినట్టు కర్నాటక మంత్రి పాటిల్ చెప్పేశారు.
- ఎన్నార్టీ



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!