చిరంజీవి అల్లుడు అమాయకుడా? (ప్రత్యేక కథనం)

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు మంచివాడేనా...? లోపమంతా చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ లోనే ఉన్నదా...?? శ్రీజ హైదరాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్త శిరీష్ భరద్వాజ్ కట్నం కోసం వేధిస్తున్నాడంటూ చాలా స్ట్రాంగ్ గా కేసుపెట్టింది. దీంతో భరద్వాజ్ నీ, అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన భరద్వాజ్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. దీంతో కేసు ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతోంది. మరో పక్క భరద్వాజ్ తన భార్యను చూడాలని ఉన్నదంటూ మానవ హక్కుల సంఘానికి (హెచ్.ఆర్.సి) విజ్ఞప్తి చేసుకున్నాడు.
 ఈ నేపథ్యంలో కొన్నివిషయాలపై ఆసక్తి నెలకొంది.
1. గత కొంతకాలంగా శ్రీజ అత్తింట్లోలేదు. ఆమె పుట్టినింటనే ఉంటున్నది.
2. శిరీష్ భరద్వాజ్ గురించి ఎంత గుచ్చిగుచ్చి అడిగినా సమాధానం చెప్పడంలేదు.
3. ఫిబ్రవరి 26న బేగంపేటలోని ఒక పబ్ లో శ్రీజ దంపతులు ఫోటోకి ఫోజ్ ఇచ్చారు.
4. అదే రోజున గోవాలోని మేనేజ్ మెంట్ కంపెనీతో వాణిజ్య సంబంధాలను భరద్వాజ్ మెరుగుపరుచుకున్నారు. అందుకు ఈ పబ్ సమావేశం దోహదపడింది.
5. అంతకు ముందు నాలుగు నెలల కిందటే భరద్వాజ్ గోవాలోని టిటొస్ గ్లోబల్ ఈవెంట్స్ అనే కంపెనీతో టైఅప్ పెట్టుకున్నాడు.
6. హైదరాబాద్ లో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ డీల్ కుదిరింది.
7. భరద్వాజ్ తన వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే అదే రోజున ప్రముఖ సినీనటులను, సినీ తారలను పిలిపించాడు.
8. అందుకే తన భార్య (చిరంజీవి రెండో కుమార్తె)ను కూడా  పార్టీకి తీసుకువచ్చాడు.
9.  శ్రీజ- భరద్వాజ్ ల ప్రేమపెళ్ళి జరిగి మూడున్నరేళ్లు అవుతోంది. వీరి ప్రేమ వివాహం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. వివాహం తరువాత దంపతులు చాలా ఆనందంగానే ఉన్నారు.
10. అయితే, అదే సమయంలో చిరంజీవి ఇంట్లో ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ తయారైందని ఫిల్మ్ నగర్ వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి.
11. చిరంజీవిలో మార్పు వచ్చినా, అల్లుడిని మాత్రం మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోయారని మెగాస్టార్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నిర్మాత బాహాటంగానే అంటున్నారు.
12. చిరంజీవి తండ్రి స్వర్గస్థులైనప్పుడు, 2007లో శ్రీజ మొదటిసారిగా పుట్టింటికి వెళ్ళింది.
13. ఈ మధ్యకాలంలో శ్రీజ పుట్టింటికి రావడం తరచూ జరిగే సంఘటనే అయింది. అంతేకాదు, ఆమె తన తల్లిదండ్రులతో పార్టీలకు కూడా వెళుతూనే ఉంది. ఇంటి అల్లుడు మాత్రం ఎప్పుడూ కనబడలేదు.
14. భర్త లేకుండా శ్రీజ ఒక్కతే తండ్రి చిరంజీవితో పాటుగా పార్టీల్లో కనబడినప్పుడే ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడాయి.
15. మనవరాలు పుట్టినప్పుడైనా తాత చిరంజీవి మనసు మారుతుందని అల్లుడు భరద్వాజ్ భావించారు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. మనవరాలిని చూసేందుకు 2008లో చిరంజీవి సతీమణి సురేఖ, శ్రీజ సోదరుడు రాం చరణ్ తేజ మాత్రమే ఆస్పత్రికి  వెళ్ళారు.
16. చిరంజీవి కుటుంబం నుంచి ఎంతగా వ్యతిరేకత వస్తున్నా, భరించిన భరద్వాజ్ చివరకు రెండో దారి (వ్యాపారానికి డబ్బు కావాలని అడిగే దారి)ని ఎంచుకునేలా పరిస్థితులు కల్పించారనీ, ఇదంతా మెగా స్క్రిప్ట్ లో అంతర్భాగమేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
17. మెగాస్టార్ ఇంట్లో శ్రీజకు పెద్దపెట్టునే `కౌన్సిలింగ్' జరిగిందనీ, దీంతో శ్రీజకు ప్రేమ స్థానంలో తన భర్త పట్ల ద్వేషం పుట్టుకువచ్చిందనీ, ఈ సమయంలోనే భరద్వాజ్ వ్యాపారం నిమిత్తం డబ్బు అడిగేసరికి శ్రీజ ఉవ్వెత్తున వ్యతిరేకించి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
 అయితే, ఏది నిజం, మరేది మసిపూసిన మారేడుకాయే దర్యాప్తులోగానీ తెలియదు. అప్పటివరకు ఈ కథకు ఫుల్ స్టాప్ ఉండదు.

కామెంట్‌లు

  1. srija bhartha bharadwaja maha muduru ani vinnanu miru oke konam nuchi rasinattuga anipistondi

    రిప్లయితొలగించండి
  2. బుద్ధామురళి గారు! తెలివితేటలు, కాలం, ముదురుబోతుదనం వాట్ ఎవర్ ఇట్ మేబీ... ఇవన్నీ కలసి ఎవరికి కొమ్ముకాస్తాయి? భరద్వాజ్ లాంటివారికేనని మీ నమ్మకమా?? మీకే తప్పనిపించడం లేదూ?!? మీ వుద్ధేశ్యం ప్రకారం.. చిరంజీవి కుటుంబం అత్యంత సహృద్భావం ఉన్నవాళ్లనా!? వారికి ముదురుతనం అస్సలు తెలియదనా!?! టోటల్ గా మీ ఇంట్రస్ట్ ఏమిటి??? చిరంజీవి కుటుంబం కన్నా భరద్వాజ్ శ్రీజను ప్రేమించిన పాపానికి... ముదురైపోయినట్టేనా. దీన్లో చిన్న లాజిక్ కనిపించడం లేదా. ఇందులో ఇంకేమయినా వుందేమో కాసేపు ఆలోచించాలనిపిస్తోంది. మీకేం అనిపించడం లేదా?!

    రిప్లయితొలగించండి
  3. peddavallu edaina cheyagalarani cheppadaniki ide nidarshanam,pedavadi kopam pedaviki chetu

    రిప్లయితొలగించండి
  4. శ్రీజ పేరు మీద కోట్ల ఆస్తి ఉంది. శిరీష్ యాభై లక్షల కట్నం కోసం కోట్ల ఆస్తిని వదులుకునేంత అమాయకుడనుకోను.

    రిప్లయితొలగించండి
  5. shirish B Tech classmates naku telsu... vadenta pedda yedavo kuda naku telusu...

    ofcourse ammayilu yedavalake padipotaru..

    రిప్లయితొలగించండి
  6. కట్టు కథలని అంత సులభంగా నమ్మెయ్యడం విడ్డూరంగా ఉంది. యాభై లక్షల రూపాయల కోసం కోట్ల ఆస్తిని వదులుకునేంత అమాయకులు ఉంటారా? బంగారు బాతుని చంపేవాని గురించి కథల్లో చదివాము కానీ అలాంటివాళ్ళు నిజ జీవితంలో ఉంటారనుకోను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!