గాలి పిటిష‌న్ 29కి…


అక్రమమైనింగ్‌లో అరెస్టైన గాలి జానర్థన్ రెడ్డి కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా పడింది. గాలి తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి ప్రత్యేక కోర్టు తెలిసింది. అటు గాలి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. గాలికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. గాలి అనుచరులు పలువురు పరారీలో ఉన్నారని, ఇంకా పలువురు అధికారులను విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపింది. బ్యాలెన్స్ షీట్లపై శ్రీనివాస్‌రెడ్డి ఎండీగా సంతకాలు చేయలేదని, డైరెక్టర్లుగా గాలి, అరుణ సంతకాలు చేశారని, ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి అక్రమమైనింగ్‌కు పాల్పడినట్లు సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి చురుకుగా వ్యవహరించారని సీబీఐ గుర్తించింది. రెండో సారి బెయిల్ పిటిషన్‌లో ఎలాంటి మార్పు లేదని, ఆ పిటిషన్ చెల్లదని సీబీఐ చెప్పింది. ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగానే గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు సీబీఐ కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!