సెవెంత్ సెన్స్ ఆడియో విడుదల


మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సెవెన్త్ సెన్స్’. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల య్యాయి. తొలి సీడీని రామ్‌చరణ్ విడుదల చేసి హీరో కార్తికి అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ “పాటలను వైవిధ్యంగా తెరకెక్కించాం. ఈ సినిమాలో ఓ పాటను జనం మధ్య తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి చెన్నై లోని రంగనాథన్ స్ట్రీట్ వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రీకరించాం” అని చెప్పారు. సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ మాట్లాడుతూ “దాదాపు ఏడేళ్ళ తర్వాత మురుగదాస్, సూర్య కలిసి చేస్తున్న సినిమా. ఇందులో ఓ చైనీస్ పాట కూడా ఉంటుంది. అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “మా తరం నాయకులు సిగ్గుపడేట్టుంటుంది ఈ సినిమా. యాక్టర్అంటే సూర్యలాగా ఉండాలి. ఈ పాత్రకు సూర్య తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. మగధీర సూర్య చేయవలసిన సినిమా. మురుగదాస్‌తో పనిచేయాలని కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది” అని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!