బందే మాత‌రం..


అదేమిటి.. వందేమాత‌రం అనాలి క‌దా.. అనుకుం టున్నారా..?  ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో అంద‌రూ బందేమాత‌రం అని అంటున్నారు.. వందేమాత‌రం అని సంవ‌త్స‌రానికి రెండు సార్లు మాత్ర‌మే అంటారు.. ఆగ‌ష్టు 15న‌, జ‌న‌వ‌రి 26న‌. సంవ‌త్స‌రానికి ఎన్నిసార్ల‌యినా అనేది బందేమాత‌రం.. దీనికి ఓ స‌మ‌యం అంటూ ఉండ‌దు. మ‌న రాజ‌కీయ‌నాయ‌కుల పుణ్య‌మా అని వారానికి రెండు బందుల‌తో వ‌ర్థిల్లుతోంది రాష్ట్రం.. ఈ బందుల‌తో సామాన్యుడు స‌త‌మ‌త‌మ‌వుతూ.. ఏమి చేయాలో పాలుపోక‌.. మందేమాత‌రం అని అంటున్నాడు.. ఈ మందేమాత‌రానికి ఎలాంటి స‌మ‌య‌మూ, సంద‌ర్భ‌మూ ఉండ‌దు.. సంతోషం వ‌చ్చినా మందేమాత‌రం.. క‌ష్టం వ‌చ్చినా మందేమాత‌రం.. న‌లుగురు ఫ్రెండ్స్ క‌లిస్తే మందేమాత‌రం, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట‌ర్ల చెవులు చిల్లులుప‌డేలా మందేమాత‌రం.. దేశాన్ని ముందుకు న‌డిపించే వందేమాత‌రం క‌నుమ‌రుగ‌వుతుంది.. దేశాన్ని నిలువునా ముంచే మందేమాత‌రం ముందుకు వ‌చ్చింది.. దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేయ‌డానికి రెడీ అవుతుంది ఈ బందేమాత‌రం.. ఇప్పుడు మ‌న‌మేమాత‌రానికి జై కొట్టాలి.. వ ఛ కాదు, మ‌, కాదు బందేమాత‌రం.. అనాలి.. త‌ప్ప‌దు.. మ‌నం అన‌క‌పోయినా.. కాల‌ర్‌ప‌ట్టిమ‌రీ అనిపిస్తారు.. బందేమాత‌రం.. అని..
-సిఎస్‌కె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!