హైద‌రాబాద్ లేకుండా తెలంగాణ‌


తెలంగాణ రాష్ట్రం కావాలంటే తెలంగాణ నేతలు హైదరాబాద్ ను వదలుకోవలసిందేనని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. విజయరామరాజు సాధారణంగా రాష్ట్ర రాజకీయాలలో అంత జోక్యం చేసుకోరు.పెద్దగా వివాదాస్పద ప్రకటనలు చేయరు. అలాంటిది ఇప్పుడు విజయరామరాజు సైతం ఈ తరహా ప్రకటన చేయడం ఆసక్తికరంగా ఉంది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సమావేశంలో కూడా మంత్రి శైలజానాధ్ ఇదే తరహా ప్రకటన చేశారు.ఎట్టి పరిస్థితిలోను హైదరాబాద్ ను వదలుకోబోమని, హైదరాబాద్ తెలుగు ప్రజల ఆత్మ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విజయరామ రాజు కూడా అదే తరహాలో ప్రకటన చేయడం చూస్తుంటే కేంద్రంలో ఈ తరహా ప్రతిపాదన ఏదైనా నడుస్తున్నదా అన్న సందేహం వస్తోంది.తెలంగాణ సమస్య పరిష్కారంలో హైదరాబాద్ ముఖ్యమైన పాయింట్ గా ఉంది. కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నదా? లేదా అన్నది తేలడానికి మరికొంతకాలం పడుతుంది. కాని కోస్తా నేతలు కొందరిలో ఈ మార్పు రావడం కూడా గమనించదగిన అంశమే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!