హీరోయన్లపై `మా’ సీరియస్


తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వేరే రాష్ట్రాల నుండి వ‌చ్చిన ముద్దు గుమ్మ‌లు హీరోయ‌న్లుగా టాప్ పొజిష‌న్‌లోకి వ‌స్తున్నారు. మ‌న తెలుగు ప్రేక్ష‌కులు వారిని ఎంతో బాగా ఆద‌రిస్తున్నారు. ఈ కోవ‌లో ప్ర‌స్తుత ఉన్న హీరోయిన్లు త్రిష‌, జెనీలియా, ఇలియానా, సుమంత‌, కాజ‌ల్ లాంటి హీరోయిన్లంద‌రూ ప‌ర‌భాషావాళ్లే. అయినా తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నారు. కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మా అసోసియేష‌న్ ఈ స్టార్ హీరోయిన్ల‌పై క‌న్నెర్ర‌జేసింది. ఏకంగా వారిపై వేటు వేయ‌డానికి ఇద్ద‌ప‌డింది. అంత పెద్ద పొర‌పాటు ఈ హీరోయిన్లు ఏమి చేసార‌నే క‌దా మీ డౌటు.. తెలుగులో న‌టిస్తూ ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్న స‌ద‌రు హీరోయిన్లు.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనివారంతా క‌లిసి పెట్టుకున్న మా అసోస‌యేష‌న్ లో స‌భ్య‌త్వం తీసుకోకుండా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. మా లో స‌భ్య‌త్వం తీసుకోకుండా తెలుగు సినిమాల‌లో కొన‌సాగ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్న‌స్తోంది మా. మ‌రి మా సీరియ‌స్‌ని గ్ర‌హించి వెంట‌నే స‌భ్యులుగా చేరిపోతారా.. లేదా నిర్ల‌క్ష్య‌వైఖ‌రి ప్ర‌ద‌ర్శించి మా అసోసియేష‌న్ అన్న‌ట్టుగానే వారిపై వేటు వేసేంత వ‌ర‌కూ తెచ్చుకుంటారా.. అన్న‌ది చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!