ఉపగ్రహం కూలడంపై నాసా మౌనం


నాసాకు చెందిన అతిపెద్ద ఉపగ్రహం యుఏఆర్ఎస్ నరాలుతెగే ఉత్కంఠ మధ్య చివరకు కెనడాలోని కల్గరీ ప్రాంతం వద్ద కూలినట్టు శనివారం (24.09.11) రాత్రి 8-00 గంటల ప్రాంతంలో వార్తలందాయి. ఈలోగా ప్రపంచ దేశాలన్నీ తెగ టెన్షన్ పడ్డాయి. రెండు గంటల ముందు ఎక్కడ కూలుతుందో చెబుతామన్న నాసా చివరకు మౌనంగా ఉండిపోయింది. రాత్రి 8 గంటలకు కూడా నాసా పేరిట ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ లో మాత్రమే కెనాడాలో కూలినట్టు వార్త వచ్చింది. 1979లో స్కైలాబ్ తరువాత అత్యధిక టెన్షన్ పెట్టిన ఈ కాలం చెల్లిన ఉపగ్రహం పతనంపై నాసా ఎందుకింతగా సమాచారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో అర్థం కావడంలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!