స‌మ్మెపై స్వామిగౌడ్ అసంతృప్తి


సకల జనుల సమ్మె జరుగుతున్న తీరుపై, తెలంగాణ రాజకీయ జెఎసిలో ముఖ్య రాజకీయ పక్షాలైన టిఆర్ఎస్, బిజెపి, న్యూడెమొక్రసి వంటి పార్టీల తీరుపై తెలంగాణ ఉద్యోగుల సంఘ జెఎసి నేత స్వామిగౌడ్ మండిపడుతున్నట్లు కధనాలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ముందుగా చెప్పినట్లు చేయడం లేదని, సకల జనుల సమ్మె అంటే కేవలం ఉద్యోగుల సమ్మెగా మారిందని తీవ్ర అసతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రహదారుల దిగ్భందం తీరుకాని, కార్యాలయాలను బంద్ చేసే విషయంలోకాని చెప్పినవిచెప్పనట్లు జరగలేదని ఆయన అన్నారని అంటున్నారు.ఇలాగైతే సమ్మెను ఆపివేద్దామని కూడా ఆయన స్పష్టం చేశారట.రోడ్లను తవ్వుదామని, ఇంకేదేదో చేద్దామని నేతలు చెప్పారు.కాని అలా ఏమీ జరగలేదు. బస్ లలోకి జనం ఎక్కకుండా చూడాలని అనుకున్నా అలాచేయలేదు అని ఆయన అన్నట్లు చెబుతున్నారు.నాగం జనార్ధనరెడ్డి, గద్దర్ వంటి వారిని కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నాలు జరగడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కోదండరామ్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయిని నరసింహారెడ్డి, శ్రావణ్, సుధాకర శర్మ, అశోక్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్న సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!