బ‌ళ్ళారి నుండి గాలి డ‌బ్బు


బళ్లారి నుంచి లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న డబ్బు ఎవరికోసం? ఎవరి ద్వారా అన్నదానిపై రకరకాల కధనాలు వస్తున్నాయి. ఇది కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి చెందిన డబ్బు అని అంతా భావిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన వ్యక్తిది ఈ లారీగా గుర్తించారు. లారీలో ఉన్న ఈశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి అనేవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు తమకు ఏమీ తెలియదని, ఇరవై వేల కిరాయి ఇచ్చి ఈ బ్యాగులు కాటేదాన్ లో చేర్చమన్నారని ,తాము రవాణా చేస్తున్నామని చెప్పారని అంటున్నారు. అయితే ఇంటరాగేషన్ లో వారు మరోవిషయం బయటపెట్టారు. ఒక ఎమ్మెల్యే ద్వారా రాష్ట్ర మంత్రి ఒకరికి ఈ డబ్బు అందచేయడానికి తీసుకువెళుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. గతంలో గాలి జనార్ధనరెడ్డికి ఆ మంత్రి సహకారం అందించి ఉంటారని, అందుకు ప్రతిగా ఈ డబ్బు చేరవేస్తుండవచ్చని కొన్ని కదనాలు వచ్చాయి. అయితే పూర్తి వివరాలు బయటకు వస్తే ఈ కధ అత్యంత ఆసక్తికరంగా ఉండవచ్చని భావిస్తున్నారు. లారీలో వారు తమకు తెలియదని చెప్పినా, వారు రూటు మార్చి లారీని తీసుకు వెళ్లడానికి ప్రయత్నించి గుంతకల్ వద్ద దొరికిపోయిన తీరుతో వీరికి అన్ని విషయాలు తెలుసు అన్న అభిప్రాయం కలుగుతుంది.లారీ యజమాని ప్రొద్దుటూరు చెందిన భాషాగా గుర్తించారు. కాగా ముందుగా నాలుగు కోట్లు అని ఎంచిన పోలీసులు ఆ తర్వాత మీడియా హడావుడితో మరో బ్యాగు కూడా ఉందని గుర్తించి ఐదు కోట్ల రూపాయల మొత్తంగా లెక్కించారని కూడా కధనాలు వస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!