ఆర్‌.టి.సి. స‌మ్మె విర‌మ‌ణ‌..?


సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసే దిశగా ఆర్టీసి జెఎసి, తెలంగాణ ఎన్‌ఎంయు నాయకులు అడుగులు వేస్తున్నారా? తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ దసరాను దృష్టిలో ఉంచుకుని..ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండటానికే జెఎసి నాయకులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలోని ప్రతి గడపలోనూ కుటుంబ సభ్యులందరితో సంతోషంగా జరుపుకొనే దసరా ఉత్సవాలకు ఆర్టీసి సమ్మె గండి కొట్టిందనే విమర్శలకు తావివ్వకుండా, ఆర్టీసి ఉద్యోగులు తమ ఆనందాన్ని హరించి వేశారనే అపవాదును మూటగట్టుకోకుండా ఉండటానికి కనీసం తాత్కాలికం గానైనా సమ్మెను వాయిదా వేయాలనే దిశగా ఆర్టీసి జెఎసి నాయకులు యోచిస్తున్నట్టు తెలిసింది. వచ్చేనెల 2వ తేదీన సమ్మెను విరమించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని తెలంగాణ జెఎసి కన్వీనర్‌ కోదండరామిరెడ్డి దృష్టికి తీసు కెళ్లగా..తొలుత ఆయన ఇందుకు అంగీకరించలేదని, అయితే ఆర్టీసి జెఎసి నాయకులు నచ్చజెప్పడంతో అయిష్టంగానే తల ఊపినట్టు తెలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!