సిబిఐ ముందు గాలి సోద‌రుడు


గాలి జానార్ధన్‌రెడ్డి అక్రమమైనింగ్ కేసులో శుక్రవారం ఉదయం గాలి సోదరుడు కరుణాకర్‌రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. గాలికి సంబంధించిన మైనింగ్ వ్యవహారంపై విచారణ జరగనుంది. గాలి కరుణాకర్ వద్ద నుంచి ఆస్తులకు సంబంధించిన వివరాలను సీబీఐ సేకరించనుంది. మరోవైపు జగన్ కేసులో సాక్షి వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి 15 వ రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ఆయనతో పాటు స్టైలీష్ హోం ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే ఎమ్మార్‌లో విల్లాలు కొనుగోలు చేసిన వారిని సీబీఐ విచారిస్తోంది. ఈ ఉదయం చంద్రబాబు ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం నారా బ్రహ్మిణి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అంతకు ముందు ఎన్డీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి సతీమణి రమాదేవి వద్ద వివరణ తీసుకున్నారు. గల్లా పద్మావతిని కూడా సీబీఐ ప్రశ్నించింది.మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ రెండో రోజు సీబీఐ ముందు హాజరయ్యారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!