నిన్న వ్యాట్ వాత‌.. నేడు పెట్రోల్ మంట‌..


రాష్ట్ర కేంద్ర ప్ర‌భుత్వాలు త‌మ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి జ‌నంపై భారం మోపుతూనే ఉన్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వారు వెనుక‌డుగు వేయ‌డం లేదు. లీట‌రు పెట్రోలు డెబ్బై రూపాయ‌లు దాటిన‌ప్ప‌టికీ మ‌ళ్ళీ మ‌రో 4 రూపాయ‌లు పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. దాదాపుగా ఈ పెరుగుద‌ల ఖాయంగానే క‌నిపిస్తోంది. అమెరిక‌న్ డాల‌ర్‌తో ఇండియ‌న్ రూపాయి విలువ త‌గ్గ‌డం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని చ‌మురు కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఎత్తేసిన త‌ర్వాత కంపెనీలు త‌మ ఇష్టానుసారం ధ‌ర‌ల‌ను పెంచేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ల‌పై ఉన్న స‌బ్సిడీల‌ను ఎత్తేసి బ‌హిరంగ మార్కెట్‌తోస‌మానంగా ధ‌ర‌లు ఉండాల‌న్న భావ‌న‌కి కూడా చ‌మురు కంపెనీలు వ‌చ్చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌రింత‌గా ఉండే ప్ర‌మాదం ఉంది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, పెట్రోలు వంటి వాటిపై ఎడాపెడా ప‌న్నులు పెంచేసి, ధ‌ర‌లు పెంచేసి ప్ర‌భుత్వం త‌మ ఖ‌జానాను నింపుకునే ప్ర‌య‌త్నం చేస్తుందే త‌ప్ప ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో స‌మాన్యుడు ఎలా బ్ర‌తక‌గ‌ల‌డు అని మాత్రం ఆలోచించ‌లేక‌పోతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!