బాన్సువాడ ఎన్నిక‌ల న‌గారా..


బాన్సువాడ ఉప ఎన్నికకు నగారా మోగింది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది. రాజీనామా చేసిన పోచారం టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగనుండగా, కాంగ్రెస్, టిడిపిలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. బిజేపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. 26వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
అక్టోబరు 13న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ జరగనున్నాయి. నాలుగు మండలాల్లోని లక్షా 56వేల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ వైఖరికి నిరసనగా రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. అటు తర్వాత పోచారం టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీ తరపున పోటీకి రెడీ అవుతున్నారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా రికార్డు స్థాయిలో మోజార్టీ వచ్చే విధంగా చూడాలని గులాబిదళం ప్రయత్నిస్తోంది.
మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీలు కొత్త అభ్యర్ధులను వెతుక్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల్లో పోట చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేసినా అదిష్టానం పట్టించుకోలేదు. అభ్యర్ధిని నిలపాల్సిందేనని నిర్ణయించింది. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల్లో పోటిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆ పార్టీ కొత్త అభ్యర్ధిని వేతికే పనిలో నిమగ్నమైంది. అటు టీడీపీ పోటి చేయాలా వద్దా అనే సందిగ్దంలో ఉంది.
పోటీ చేయవద్దని టీటీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ బరిలోకి దిగుతుండటంతో టీడీపీ కూడా పోటీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్ధిని నిలపడంలేదని ఇప్పటికే ప్రకటించాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!