కాబోయే ప్ర‌ధాని మోడీయే..!


కేంద్రప్రభుత్వం సంక్షోభం లో పడిందని,ప్రధాని బలహీన ప్రధాని గా ముద్రపడ్డారని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎమ్.వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కేంద్రంలో పరిస్థితి అంతా గందరగోళంగాఉందని దేశానికి ఒక దశ, దిశ లేకుండా పోయిందని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మూడికి ప్రధాని అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని ఆయన ప్రశంసించారు. వై.ఎస్.జగన్ తో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని ఆయన అన్నారు.బిజెపి నేతలు ఒక్కొక్కరే నరేంద్ర మోడికి మద్దతుగా మాట్లడడం ఆరంభిస్తున్నారు. ఇప్పటికే బిజెపి సీనియర్ నేత ఎల్.కె. అద్వాని కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడికి ప్రధాని అభ్యర్ధి అయితే మంచిదేని వ్యాఖ్యానించారు. తదుపరి అరుణ్ జైట్లి, ఇప్పుడు వెంకయ్యనాయుడు మద్దతు ప్రకటించారు.మరి సుష్మ స్వరాజ్ ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు.ఎన్.డి.ఎ. అదికారంలోకి వస్తే తానే అభ్యర్ధి కావాలని ఆమె ఆశిస్తున్నారు. కాని పరిస్థితి మెల్లగా నరేంద్ర మోడికి అనుకూలంగా మారుతోంది.మోడి శనివారం నాటి నుంచి మూడు రోజుల దీక్ష చేస్తున్న సందర్భంలో ఈ చర్చ ఆసక్తికరంగా మారింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!