మోడీ స‌ద్భావ‌న దీక్ష ప్రారంభం


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సద్భావన దీక్షను ఆరంభించారు. ఆయన మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారు. బిజెపి సీనియర్ నేతలు ఎల్.కె.అద్వాని, అరుణ్ జైట్లి , పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తదితురుల హాజరు అయ్యారు. దీక్షకు ముందు మోడి తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం వేదిక మీద పలువురు మతపెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కాగా మోడీ దీక్షకు పోటీగా కాంగ్రెస్ నత శంకర్ సింగ్ వాఘేలా దీక్ష చేపడుతుండడం విశేషం. దేశంలో శాంతి, సద్బావనలు విలసిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ దీక్ష చేపట్టడం విశేషం. మోడీ దీక్ష ఒక డ్రామా అని కాంగ్రెస్ విమర్శించింది. కాగా ప్రత్యేక దర్యాప్తు విబాగం సిట్ గుజరాత్ అల్లర్లలో మోడీకి ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నరేంద్ర మోడీ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. దాంతో ఆయన దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పత్రికలలో తన దీక్షకు సంబంధించి ప్రచార ప్రకటనలు కూడా జారీ చేశారు. నరేంద్ర మోడీ బావి ప్రధాని అభ్యర్ధిగా ప్రొజెక్టు అవుతున్న నేపధ్యంలో ఈ దీక్షకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!