మ‌న్మోహ‌నా.. నీకిది త‌గునా..


భార‌త‌దేశంలోనే ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన నేత మ‌న్మోహ‌న్ సింగ్‌.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ని స‌మ‌ర్థ‌వంతంగా తీర్చిదిద్దిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న‌ని ఏకంగా ప్ర‌ధాని పీఠాన్ని అధిష్ఠించేలా చేసింది. కానీ.. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి అయ్యాక నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌తో పాటు, చ‌మురు ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటాయి. మ‌రో వైపు ధ‌నవంతుల‌కి లాభాలు చేకూర్చే విధంగా కొన్ని ప్ర‌ణాళిక‌లు త‌యార‌వుతున్నాయి. ఉన్నోడు ఇంకా సంపాదిస్తున్నాడు, లేనోడు సంపాదించే అవ‌కాశం లేకుండా వాడిపై అధిక ధ‌ర‌లంటూ, ప‌న్నులంటూ, వ్యాట్‌లంటూ భారాన్ని మోపుతూనే ఉన్నారు. ఇక పెట్రోలు విష‌యానికి వ‌స్తే మ‌న దేశం నెంబ‌ర్ వ‌న్ లో నిలుస్తుంది.. ఎలాగంటారా..  ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలలో పెట్రోలు ధరలు ఎక్కువ‌గా ఉన్న దేశం మ‌న‌దే. పెట్రోలు ఉత్పత్తికి అవసరమైన క్రూడ్ దిగుమతి పేరుతో కొంత వ్యవయం అవుతుంటే, దానిపై వేసే రకరకాల కస్టమ్స్, ఇతర పన్నుల పేరుతో దేశంలో వినియోగదారుడిపై విపరీత భారాన్ని మోపుతున్నారు. కేంద్రం వాటి గురించి మాట్లాడ‌దు. అస‌లు క్రూడాయిల్ ధ‌ర పెరిగింద‌ని నిర్ధాక్షిణ్యంగా ఆ భారాన్ని వినియోగ‌దారుడిపై మోపే కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కో సారి క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్పుడు మాత్రం పెట్రోలు ధ‌ర‌ని త‌గ్గించాల‌న్న ఊసే ఎత్త‌దు.. పైగా  రాష్ట్రాలు పెట్రోలుపై తాము వేస్తున్న అదనపు భారాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రి ఎకె ఆంటోని సూచిస్తున్నారు. 157దేశాలలో పెట్రోలు ధరల పరిస్థితిపై విశ్లేషిస్తే, 98 దేశాలకన్నా మన దేశంలో ఈ రేటు అత్యధికంగా ఉందని తేలింది. వెనిజులా దేశంలో అన్ని దేశాల కన్నా చౌక ధరకు పెట్రోలు లభిస్తుంది.అక్కడ లీటర్ రూపాయి పద్నాలుగు పైసలు మాత్రమే ఉంది. అమెరికాలో లీటర్ పెట్రోలు ఇప్పటికీ 42.82 రూపాయలుగా ఉంది. భారత దేశంలో వివిధ నగరాలలో లీటర్ ధర సగటు 69.90 రూపాయలుగా ఉంది. బ్రేక్ పాయింట్ ధరల పట్టీని టైమ్స్ ప్రచురించింది.దాని ప్రకారం ఇండియా అత్యధికంగా పెట్రోలుకు 3.95, డీజిల్ కు 2.46 గా ఉంది. ఆ తర్వాత చైనా, బ్రిటన్, అమెరికాలు ఉన్నాయి. బాగా తక్కువ ధరలు ఉన్న దేశాలలో సౌదీ అరేబియా, వెనిజులా వంటి చిన్న దేశాలు ఉన్నాయి. అత్యంత ప్ర‌తిభావంతుడు, దేశంలోనే ఎంతో నైపుణ్యం గ‌ల ఆర్థిక నిపుణుడిగా పేరు తెచ్చుకున్న మ‌న్మోహ‌న్ సింగ్ సార‌థ్యంలో న‌డుస్తున్న ఈ ప్ర‌భుత్వంలో సామాన్యుడిని న‌డ్డివిరిచేలా ధ‌ర‌ల పెరుగుద‌ల‌ని చూస్తుంటే మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉండ‌డం దేశ ప్ర‌జ‌లు చేసుకున్న దౌర్భాగ్య‌మేనా..? అన్న ఆలోచ‌న రాక మాన‌దు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!