హాట్ తాప్సీ ల‌వ్ ఎఫైర్‌..


జుమ్మందినాథం చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన ముద్దు గుమ్మ తాప్సీ.. ఈ చిత్రం త‌ర్వాత తాప్సీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్‌గా దూసుకుపోతోంది. వ‌రుస ఆఫ‌ర్ల‌తో మాంచి ఊపు మీదున్న తాప్సీ ల‌వ్ ఎఫైర్ సాగిస్తోంద‌ని కోలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంలో మ‌హ‌త్ అనే ఓ యంగ్ హీరోతో తాప్సీ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిందిట‌. తాప్సీ ఎక్క‌డికి వెళ్లినా కూడా మ‌హ‌తి కూడా ఉంటున్నాడు. తాప్సీ హూటింగుల‌కు వెళ్లినా, ఏదైనా ప్రైవేట్ ఫంక్ష‌న్ల‌కి హాజ‌రైనా ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుకుతున్నారు. ఇదే విష‌యాన్ని తాప్సీని అడిగితే ష‌రా మామూలుగానే తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని మా మ‌ధ్య స్నేహ‌మే త‌ప్ప మ‌రింకేమీ లేద‌ని, ఇవ‌న్నీ గిట్ట‌ని వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్న‌మ‌ని కామెంట్ చేస్తోంది. ఇంత‌కీ ఈ మ‌హ‌త్ నిర్మాత ద‌యానిథి అళ‌గిరికి స‌న్నిహితుడ‌ని, హీరో శింబుకి చిన్న‌నాటి స్నేహితుడ‌ని చెబుతున్నారు. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మలో మంచి ప‌రిచ‌యాలున్న మ‌హ‌త్‌ని మ‌చ్చిక చేసుకుంటే అవ‌కాశాలు త‌న్నుకుంటూ వ‌స్తాయ‌ని, అందుకే తాప్సీ మ‌హ‌త్‌ని బుట్ట‌లో వేసుకుంద‌ని కోలీవుడ్‌లో ఓ గాసిప్ వినిపిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!