గాయత్రీ దేవిగా దుర్గామాత‌


దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ నేడు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో రెండోరోజు అమ్మవారు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిస్తోంది.
గాయత్రీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

అనంత శ‌క్తిగ‌ల గాయ‌త్రీ దేవి

గాయత్రీ దేవి మహా శక్తిగలది. ఆమెను వర్ణించనలవి కాదు. ఆమె తన భక్తులపై అమోఘమైన దయ చూపుతుంది. గాయత్రీ కవచానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అధిపతులు. రుగ్వేదం, యజుర్వేదం, సామ, అధర్వణవేదాలు ఆమెను కీర్తించే కీర్తనలకు ఛందస్సులుగా ఉన్నాయి. గాయత్రీ మహామంత్రాన్ని పఠించిన వారికి ఈతి బాధలు ఉండవు.
సర్వ సుఖాలు కలుగుతాయి. గాయత్రీ మంత్రం ప్రతిరోజూ మూడు వేళల్లో కూడా సూర్యోపాసనను అనుసంధానం చేసి అర్ఘ్యం ఇవ్వడం అచారంగా వ స్తోంది. ప్రధానంగా మనకు అనేక గాయత్రి జపాలు వాడుకలో ఉన్నాయి.
ఏ దేవత అర్చన జరిగినా ఓం భూర్భువస్సువః అనే మంత్రంతోటి అభిమంత్రించి నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది. ప్రతి రోజూ గాయత్రి మంత్రాన్ని నిష్ఠగా కనీసం 10, 54, 108 సార్లు జపించాలని పండితులు చెపుతున్నారు. దుర్గమ్మను గాయత్రీ దేవి అలంకారంలో దర్శించుకోవడం సర్వ పుణ్యప్రదమని భక్తుల నమ్మిక.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!