బిగ్‌బి గాయపడ్డాడు
బిగ్‌బి అమితాబ్బచ్చన్‌కి స్వల్ప గాయాలయ్యాయి. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న డిపార్ట్‌మెంట్ చిత్రం షూటింగ్‌లో ఆయన గాయపడ్డాడు. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన ఎద భాగానికి గాయం అయినట్టు బిగ్‌బి తన ట్విట్టర్‌లో చెప్పారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు కాస్త నొప్పిగా ఉంటుందని, అయినా కంగారు పడాల్సిందేమీ లేదని ఆయన అన్నారు. ఈ మధ్యే బిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా షూటింగ్‌లో గాయపడ్డాడు. దాంతో ఇది గాయాల సీజన్‌లా ఉంది.. అభిషేక్ గాయపడ్డాడు, నేనూ గాయపడ్డాను అంటూ వ్యాఖ్యానించరు. కంగారు పడాల్సిందేమీ లేదని.. అన్నీ సర్దుకుంటాయని తన అభిమానులనుద్దేశించి అన్నాడు బిగ్ భఙ. 68 సంవత్సరాల వయసులో కూడా షూటింగ్‌లలో యాక్టివ్‌గా పాల్గొంటున్న బిగ్‌బి అమితాబ్‌ని హీరోగా ఈ మధ్యే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బుడ్డా హోగా తేరే బాప్ చిత్రం రావడం తెలిసిందే.. ఈ చిత్రం మంచి విజయం సాధించడం, అమితబ్ సోలో హీరోగా చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో నటించి సక్సెస్ సాధించడం బిగ్‌బికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. డిపార్ట్‌మెంట్ చిత్రంలో కూడా బిగ్‌బి ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి