కిలోల‌కొద్దీ బంగారం.. కోట్ల‌కొద్దీ డ‌బ్బు..


ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) మేనేజింగ్ డైరెక్టర్ బీవీ శ్రీనివాసరెడ్డిని విచారణ నిమిత్తం శనివారం సీబీఐ అధికారులు బళ్ళారికి తీసుకొచ్చారు. అక్క‌డినుండి  సీబీఐ బృందం శ్రీనివాస్‌రెడ్డిని యాక్సిస్ బ్యాంకులోకి తీసుకెళ్లి అక్కడ జరిగిన లావాదీవీలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. బ్యాంకులో సుమారు 350 లాకర్ల వరకు ఉన్నాయని సమాచారం. ఇందులో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి బినామీ పేర్లతో సుమారు 200 లాకర్లు వాడుకుంటున్నట్లు బ్యాంకు వర్గాల ద్వారా తెలిసింది. శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య, కూతురు పేర్లతో 10 లాకర్లున్నట్ల్లు తెలిసింది. శనివారం ఐదు లాకర్లను మాత్రమే సీబీఐ అధికారులు తెరిచారు. ఇందులో రూ. 30కోట్ల నగదును, కిలోల‌కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం
ముందుగా శ్రీనివాస్‌రెడ్డి తాను వాడిన ఆరు లాకర్లలో నాలుగింటికి తాళాలు లేవని బుకాయించడంతో నిపుణులను అనంతపురం నుంచి రప్పించి వాటిని పగులకొట్టించినట్లు సమాచారం. విదేశీ సంస్థలతో వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన విలువైన దస్తావేజులను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇతర బ్యాంకుల్లో ఎక్కడెక్కడ లాకర్లున్నాయో ఆరా తీశారు. ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచిన నగదును కూడా సీబీఐ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి తన ఆర్థిక వ్యవహారాలను ఎక్కువగా శ్రీనివాసరెడ్డి ద్వారానే జరిపించారని సమాచారం. జనార్దన్ రెడ్డి సంతకం చేస్తే బ్యాంకు వ్యవహారాలన్నీ శ్రీనివాసరెడ్డే చూసుకునేవారని చెబుతారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ దాచారు అనే విషయమై మరింత లోతుగా విచారించే అవకాశముంది. అలాగే హొస్పేట్‌లో ఉండే బ్యాంకు లాకర్లను కూడా రేపో, మాపో తెరిచే అవకాశముందని సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!