పెట్రోమంట అంద‌రికీ త‌గిలింది



పెట్రోలు ధ‌ర 3.50 పైస‌లు పెరిగింది. దీనిపై దేశ‌వ్యా ప్తంగా తీవ్ర నిర‌సన వెల్లువె త్తుతోంది. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో దాదాపు ప‌ది రూపాయ‌ల వ‌ర‌కు పెట్రోలు ధ‌ర‌ని పెంచ‌డం ప‌ట్ల ప్ర‌తి ప‌క్షాలు మండిప‌డుతు న్నాయి. ప్ర‌భుత్వం, ప్రైవేటు కంపెనీల‌తో కుమ్మ‌ క్క‌యి పెట్రోలు ధ‌ర‌ని నియం త్రించ‌కుండా వారు సూచించిన ప్ర‌కారం పెంచు కుంటూ వెళుతోంద‌ని ప్ర‌తి ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు పెట్రోలు, గ్యాసు ధ‌ర‌ల‌ని ప్ర‌భుత్వం పెంచుకుంటూ పోతుంటే సామాన్యుడి బ్ర‌తుకు మ‌రింత భారం అవుతుంద‌నీ, ఇప్ప‌టికే రాష్ట్రంలో వ్యాట్ పెంపుతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే ఇప్పుడు పెట్రో వాత కూడా తోడు కావ‌డం ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ని తీసుకువ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్లో ప్ర‌స్తుతం క్రూడాయిల్ ధ‌ర త‌గ్గింద‌నీ, అక్క‌డ ధ‌ర త‌గ్గినా పెట్రోలు ధ‌ర‌ని పెంచ‌డం ఎంత వ‌ర‌కూ న్యాయ‌మ‌న్న మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!