అహ్మ‌ద్ శాసించాడు.. అమ‌ర్ పాటించాడు..


ఓటుకు నోటు కేసు కొత్త‌మ‌లుపు తిరుగుతోంది.. అహ్మ‌ద్ ప‌టేల్ డ‌బ్బు పంపిణీ చేయ‌మంటే అమ‌ర్‌సింగ్ చేసాడ‌ని అమ‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది రాం జెట్మ‌లాని వాదిస్తున‌నారు. అంటే.. అహ్మ‌ద్ ప‌టేల్ శాసిస్తే, అమ‌ర్‌సింగ్ పాటంచాడ‌న్న‌మాట‌.. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన అమర్ సింగ్ తరపున రామ్ జెఠ్మాలని వాదిస్తున్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టులో తన వాదన చేస్తూ అహ్మద్ పటేల్ కోరడం వల్లనే డబ్బు పంపిణీ చేశారని అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమర్ సింగ్ డబ్బు పంపిణీ చేసింది వాస్తవమేనని ఒప్పుకున్నట్లుంది.ఆ తర్వాత ఆయనతో పాటు ఇతర నేతలను రంగంలోకి దించుతున్నట్లుగా ఉంది.కొద్ది రోజుల క్రితం ఆ డబ్బు బిజెపిది అయి ఉండవచ్చని వ్యాఖ్యానించిన రామ్ జెఠ్మాలని ఇప్పుడు అది కాంగ్రెస్ కోసం చేసిందని అంటున్నారు. కాగా వెంటనే ఈ ఆరోపణను అహ్మద్ పటేల్ ఖండించారు. తనకు ఈ డబ్బుతో సంబంధం లేదని ఆయన అంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించడానికి మధ్యవర్తిత్వం లేదా దళారీతనం అనండి. ఆ ప్రయత్నం చేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని రక్షించిన అమర్ సింగ్ ఇప్పుడు జైలుకు వెళ్లవలసి వచ్చింది.కాంగ్రెస్ నాయకులు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!