రాధాకృష్ణ వ‌ర్సెస్ రాంబాబు


ఎబిఎన్ ఆంద్ర‌జ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ‌కి, వైఎస్సార్ కాంగ్రెస్ ప‌ర్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబ‌బుకి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. అంబ‌టి రాస‌లీల‌లంటూ ఎబిఎస్ ఛానెల్‌లో ఓ వార్తా క‌థ‌నం రావ‌డం, అది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం క‌లిగించ‌డంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను క‌ల‌వ‌రానికి కూడా గురిచేసింది. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. కేవ‌లం 150 రూపాయ‌ల జీతం కోసం ప‌నిచేసిన రాధ‌కృష్ణ కోట్లు ఖ‌ర్చుపెట్టి ఛానెల్ కి అధిప‌తి ఎలా అయ్యాడ‌ని రాంబాబు ప్ర‌శ్నిస్తున్నాడు. అంతేకాదు రాధాకృష్ణ త‌న మీడియాను అడ్డం పెట్టుకుని ప‌లుకుబ‌డి క‌లిగిన వ్య‌క్తుల‌ని, స్వాముల‌ని బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడ‌ని కోట్ల రూపాయ‌లు వారి వ‌ద్ద‌నుండి తీస‌కుంటున్నాడ‌ని ఆరోపించాడు. చంద్ర‌బాబు నాయుడు రాధాకృష్ణ‌కి స‌బ్‌జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టుని ఎందుకు ఇచ్చాడ‌ని ప్ర‌శ్నించాడు. రాధాకృష్ణ చంద్ర‌బాబుకి ఊడ‌గం చేయ‌బ‌ట్టే ఆయ‌న ఇచ్చాడ‌ని అన్నారు. రాధాకృష్ణ‌కి వ్య‌క్తిత్వంలేద‌ని, ఆయ‌న ఓ బ్రోక‌ర్ అని తీవ్రంగా విమ‌ర్శించారు.
అంబ‌టి విమ‌ర్శ‌ల‌కి రాధాకృష్ణ కూడా ఘాటుగానే స్పందించారు. నేడు ఆయ‌న త‌న ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.. దానిలో కొన్ని.. పందికేం తెలుసు పన్నీరు వాసన! జర్నలిజం గురించి, దాని విలువల గురించి రాష్ట్రంలో ఇప్పుడు పిశాచగణాలు గావుకేకలు పెడుతున్నాయి. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసి, ఆ ధన మదంతో అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీద పడ్డ జగన్ పార్టీకి చెందిన రాంబాబు అండ్ కో… నా మీద, ఏబీఎన్ చానెల్‌పైనా వేసిన, వేస్తున్న రంకెలపై స్పందించవలసిన అవసరం లేదు. అయితే, సభ్య సమాజం తలదించుకునే రీతిలో రాంబాబు అండ్ కో చేసిన కొన్ని ఆరోపణలపై వారి కోసం కాకపోయినా ప్రజల కోసం స్పందించాల్సి వస్తున్నది.
రాంబాబు రాసలీలలపై ఏబీఎన్‌లో ప్రసారమైన కథనాన్ని ఎవరు రూపొందించినా, దాన్ని ప్రసారం చేసినందుకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఆ కథనంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పవలసింది పోయి, తాను బురదలో పొర్లుతూ, నన్ను అందులోకి లాగడానికి రాంబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నది. నాపై వ్యక్తిగతంగా ఈ పిశాచగణం చేసిన వ్యాఖ్యలను ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి వారికి వత్తాసు పలుకుతున్న రోత పత్రిక, రోత చానెల్ కూడా సిద్ధపడలేదంటే… ఆ నోటి నీచత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాంబాబు అండ్ కో ఈ దిగజారుడు ఆరోపణలు చేశారని తెలుసుకోలేనంత అమాయకుడిని కాను. ఇలాంటి కారుకూతలు, నా మనోస్థైర్యాన్ని ఇసుమంతైనా సడలించలేవని వారు తెలుసుకోవాలి. రాసలీలల కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత, రాంబాబు మద్దతుదారులమని చెప్పుకొన్న వారు నాకు ఫోన్ చేసి దూషించడమే కాకుండా, చంపుతామని కూడా బెదిరించారు.
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో… నీతి, నిజాయితీలతో మెలగడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో మనోనిబ్బరం కావాలి. అది నాకు పుష్కలంగా ఉంది. ఉన్నది పోతుందన్న భయం కానీ, లేనిది కావాలన్న పేరాశ కానీ నాకు లేవు. అందుకే ఇలా ఉండగలుగుతున్నాను. ఉంటాను కూడా. అయితే, కనీస విలువలు లేనివాళ్లు రాజకీయ నాయకులుగా చలామణి కావడమే అన్నింటికంటే విషాదం. ఈ విషాదాన్ని మౌనంగా భరిస్తారా? లేక, ప్రతిఘటించి తరిమి కొడతారా? అన్నది ప్రజలే తేల్చుకోవాలి. అంటూ త‌మ మ‌ధ్య ఉన్న వైరాన్ని చివ‌రికి ప్ర‌జ‌ల చేతుల్లోక మార్చారు.
మొత్తానికి అంబ‌టి రాంబాబు నిజాయితీ ప‌రుడ‌..?  వేమూరి రాధాకృష్ణ నిజాయితీ ప‌రుడా..? అన్న‌ది ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌న్న‌మాట‌.
-సిఎస్‌కె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!