ద‌య‌నీయ‌స్థితిలో గాలి


ఎంతలో ఎంత దారుణమైన పరిస్థితి. ఇన్నేళ్లు తను అక్రమంగానో, సక్రమంగానో సంపాదించిన సంపదతో కను సైగ చేస్తే సేవ చేసే సేవకులు, హంస తూలికా తల్పాలు, స్వర్ణంతో నిండిన ఇల్లు, ఎసిలు తప్ప స్వేదం తెలియని వ్యక్తి.. ఇప్పుడు ఏమాత్రం సదుపాయం లేని, కనీసం పరుపుకాని, దిండుకాని లేని పోలీసు ఠాణ సెల్ లో గడపవలసిన దుస్థితి. గంటల తరబడి సిబిఐ అధికారులు ప్రశ్నిస్తుంటే దిక్కుతోచని స్థితిలో ఉండవలసిన ఖర్మ పట్టింది. ఎన్నివేల కోట్లు సంపాదిస్తే ఏమి లాభం. ఇలాంటి ఖర్మ పట్టింది. ఇది కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కి పట్టిన దౌర్బాగ్య పరిస్థితి. చివరికి ఆయన కాని, ఆయన సమీప బందువు ఒఎమ్సి ఎమ్.డి శ్రీనివాసరెడ్డిలను సిబిఐ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదే పెద్ద హింసగా భావించవచ్చు. ఆ తర్వాత నగరంలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ ఒక సెల్ లో పెడుతున్నారు. అక్కడ కనీస సదుపాయాలు ఉండడం లేదని గాలి జనార్ధనరెడ్డి సిబిఐ కోర్టుకు ఫిర్యాదు చేశారు. తమకు కనీస సదుపాయాలు ఇవ్వడం లేదని, నిర్దిష్ట సమయంలో కాకుండా పొద్దుపోయేవరకు ప్రశ్నిస్తూనే ఉన్నారని వారు చెబుతున్నారు.పైగా లాయర్ల సమక్షంలో విచారణ జరగాలని కోర్టు చెప్పినా, సిబిఐ అలా చేయకుండా వారిని దూరంగా ఉంచి ఏమి ప్రశ్నిస్తున్నది లాయర్లకు వినిపించకుండా చేస్తున్నారని కూడా ఆరోపించారు.అయితే దీనిపై కోర్టు వీరికి కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించడం విశేషం.
source : kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!