రెండు రోజులు ఆటోల బంద్‌


పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అలాగే త‌క్ష‌ణం తెలంగాణ రాష్ట్ర ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి 48 గంటలు ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆటో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు రవిశంకర్, రూప్‌సింగ్, నర్సింగ్‌రావు తెలిపారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో సమావేశమై సకల జనుల సమ్మెలో ఆటో సంఘాల కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. సోమవారం నగరం తోపాటు తెలంగాణ జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా స‌క‌ల‌జనుల స‌మ్మె నేటికి ఐద‌వ రోజుకు చేరుకుంది. తెలంగాణ జిల్లాల‌లో స‌క‌ల జ‌నుల స‌మ్మెవ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందుల పాల‌వుతున్నార‌ని, ఈ స‌మ్మెవ‌ల్ల ఏమీ లాంభం ఉండ‌ద‌ని ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!