ఆయ‌న పాల‌న భేష్‌ – అమెరికా కాంగ్రెస్‌



గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాలనపై అమెరికా కాంగ్రెస్ పరిశోధనా సర్వీస్ ప్రశంసల వర్షం కురిపించింది. అమెరికన్ కాంగ్రెస్‌లో సీఆర్ఎస్ (Congressional Research Service) ఒక స్వతంత్య్ర పరిశోధనా విభాగం. సమర్ధపాలకు గుజరాత్ ప్రతిరూపమని నివేదికలో పేర్కొంది. ఈ మేరకు 94 పేజీల నివేదికను కూడా అందజేసింది. భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తులలో మోడీ ఒకరని తెలిపింది. మోడీ నాయకత్వంలోనే ప్రతిభావంతమైన అభివృద్ధిని అందిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుందని సీఆర్ఎస్ నివేదికలో పేర్కొంది.
మోడీ ఆర్థిక ప్రక్రియను సరైన దారిలో పెట్టారని, రెడ్ టేపిజాన్ని, అవినీతిని అరికట్టారని, దానివల్ల జాతీయ ఆర్థిక పెరుగుదలకు గుజరాత్ దోపదపడిందని నివేదిక అభిప్రాయపడింది. 94 పేజీల ఆ నివేదికను అమెరికా ప్రజాప్రతినిధుల కోసం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేసింది. 2002 అల్లర్ల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే రాష్ట్రంలో ఆధునిక రోడ్ల నిర్మాణంలో, విద్యుచ్ఛక్తి మౌలిక సదుపాయాల కల్పనలో మోడీ ముందంజవేశారని, ఇటీవలి సంవత్సరాల్లో గుజరాత్ 11 శాతం వార్షథిక పెరుగుదల రేటు సాధించిందని నివేదిక చెప్పింది.
ఇక మ‌న‌రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా త‌యారైంది. అభినంద‌ల మాటేమోగాని, విర‌క్తి క‌లిగే విధంగా ప్ర‌స్తుత పాల‌న కొన‌సాగుతోంద‌ని చెప్ప‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారాన్ని మోప‌డం, అన్ని రాష్ట్రాల క‌న్నా ఎక్కువ మొత్తంలో వ్యాట్‌ని వ‌సూలు చేయ‌డం, గ్రూపు త‌గాదాలు, స‌రైన నాయ‌క‌త్వం లోపించ‌డం.. ఇత్యాది విష‌యాలు రాష్ట్ర భ‌విష్య‌త్తు, అభివృద్దిపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. గుజ‌రాత్‌లా మ‌న రాష్ట్రం కూడా అభివృద్ధి ప‌థంలో ప‌య‌నించాల‌ని కోరుకోవ‌డం త‌ప్ప చేసేదేముంది..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!