స్వామిగౌడ్‌పై హ‌త్య‌కు కుట్ర‌..?


టీఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు స్వామీగౌడ్ ను చంపే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోపించారు. కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్వామీగౌడ్ ను కేసీఆర్ తో సహా.. గద్దర్, కోదండరామ్ తదితరులు పరామర్శించారు. తర్వాత కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. స్వామీగౌడ్ పై హత్యాయత్నం జరిగిందన్నారు. స్వామీగౌడ్ కు తగిలిన గాయాలను చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే గాయపర్చినట్లు తెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఈ ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ తెలిపారు. కాగా ఈ ఘటనకు కారకులైన డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ను సస్పెండ్ చేయాలని.. ఆయనపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక స్వామీగౌడ్ పై జరిగిన దాడికి నిరసనగా.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలన్నీ.. గాంధేయవాదంతోనే ఉండాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సమ్మె వల్ల ముఖ్యమంత్రిలో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపిస్తుందని కోదండరామ్ వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!