స‌మ్మెతో 3వేల కోట్లు న‌ష్టం


తెలంగాణ లో ఏర్పడిన సమ్మె పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన సుమారు మూడువేల కోట్ల ఆదాయానికి గండి పడింది.రోజుకు మూడు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేస్తున్నారు.అదే సమయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులకు వేతనాలలో చేసే కోతను తీసుకుంటే ఒక నాలుగు వందల కోట్ల వరకు ఆదా అయి ఉంటుంది. అంటే నికరంగా సుమారు 2600 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నది. రోజుకు మూడు వందల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు.సకల జనుల సమ్మెలో ఉద్యోగులు పాల్గొనడం, ఇదే తరుణంలో క్రయ విక్రయాలపై ప్రభావం పడడంతో ప్రభుత్వపరంగా రావాల్సిన రాబడిపై ప్రభావం పడుతోంది.సింగరేణి గనులలో సమ్మె వల్ల రోజుకు సుమారు ముప్పై కోట్ల నష్టం వస్తున్నదని చెబుతున్నారు.అంటే గత ఆరు రోజులలో నూట ఎనభై కోట్ల రూపాయల మేర కంపెనీ ఆదాయాన్ని కోల్పోయిందన్నమాట. అదే సమయంలో సమ్మె చేసే కార్మికులకు విధించే కోత వల్ల సుమారు అరవై కోట్ల ఆదా అవుతుంది.అలాగే ఆర్టీసి లో రోజుకు ఏడు కోట్ల రూపాయల మేర నష్టం జరుగుతోంది.ఈ పరిస్థితులను అదిగమించడానికి ప్రబుత్వం టాస్క్ పోర్సులను ఏర్పాటు చేసినా ఫలితం ఎంతవరకు ఉంటుందనేది సందేహమే. ఎందుకంటే అసలు వసూలు చేయవలసిన ఉద్యోగులు సమ్మెలో ఉంటే టాస్క్ ఫోర్స్ లు ఏమి చేయగలుగుతాన్నది ప్రశ్నార్దకం. కాకపోతే సమీక్ష లు జరిపి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!