చిదంబరం రాజీనామా చేయబోతున్నారా?


మేడమ్ సోనియాను సోమవారం (26-09-11) కేంద్ర మంత్రి చిదంబరం కలవడం, అటుపైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా మేడమ్ తో మంతనాలు ఆడటం చూస్తుంటే, చిదంబరం పరిస్థితి ఇరుకునపడినట్టే కనిపిస్తోంది. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వంలోని లుకలుకల స్థాయి ఏమిటో కూడా ఈ వ్యవహారం చాటిచెబుతున్నట్టే ఉంది.
చిదంబరం తనకు అతిముఖ్యమైన సహచరుడని ప్రణబ్ చెప్పినప్పటికీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన 2జి స్పెక్ట్రం కేసులో చిదంబరాన్ని బెంగాలీ పెదబాబు బాగానే ఇరికించినట్టే ఉన్నారు. వాలకం చూస్తుంటే కేంద్ర హోంమంత్రి చిదంబరం మెడకు ఉచ్చు  బిగిసుకున్నట్టుంది. చిదంబరం రేపోమాపో రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కుంభకోణంలో  చిదంబరం  పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఆర్ధిక  మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధి కారి  రూపొందించిన 14 పేజీల నోట్‌ను ఆర్ధికమంత్రి ప్రణబ్‌  ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. హోం మంత్రి చిదరబరం కుంభకోణం గురించి తగిన విధంగా  పరిశీలించలేదని ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సమాచార  హక్కు  చట్టం (ఆర్‌టిఐ) ద్వారా విడుదలయ్యాయి.  పదకొండు పేజీల డాక్యుమెంట్‌ను ఆర్ధికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ   వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతే   నోట్‌పై ఆమోద    ముద్ర వేశారు.  2011, మార్చిలో  పంపిన ఆర్థిక మంత్రిత్వశాఖ నోట్‌ ఆర్‌టిఐ కార్య కర్త వివేక్‌గార్గ్‌ చేతికి చిక్కింది. రాజా కేటాయించిన 2జి లైసెన్స్‌లను రద్దుచేయాల్సిందిగా డిపా ర్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) ఒత్తిడి చేసి ఉండాల్సిందని, రద్దు 2008 లైసెన్స్‌ల లబ్దిదారులకు 4.4 మెగాహెర్జ్‌ల చొప్పున కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాల్సిందిగా ఆర్ధికమంత్రిత్వశాఖ పట్టుబట్టి ఉండాల్సిందని నోట్‌లో పేర్కొన్నారు. లైసెన్స్‌దారులకు 2001లోఉన్న ప్రవేశ రుసుంనే 2008,డిసెంబరు 31వరకువిధించడానికి కూడా చిదంబరం అజమాయిషీలోని హోం మంత్రిత్వ శాఖ అంగీకరించిందని నోట్‌లో ప్రస్తావించారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖను జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్ స్వామి గత బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్రపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన ఆ లేఖను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!