తెలుగు సినిమాకి 80 ఏళ్ళు


తెలుగు సినిమా టాకీ వ‌చ్చి నేటికి ఎన‌భైఏళ్ళు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ చలనచిత్ర దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ “తొలి టాకీ విడుదల గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ‘భక్త ప్రహ్లాద’ ముందు విజయవాడ మారుతీ టాకీస్‌లోనూ తదుపరి రాజమండ్రి శ్యామల టాకీస్‌లోనూ విడులైంది. ఆ తర్వాతే చెన్నైలో విడుదలైంది. 1931 సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదలైంది అని కొందరు, 1932 ఫిబ్రవరి 14న విడుదలైందని మరికొందరు, ఏప్రిల్‌లో అని ఇంకొందరు అంటున్నారు.
దేనికీ సంపూర్ణమైన ఆధారాలు లేవు. ఇంటూరి వెంకటేశ్వరరావుగారు, వీఏకే రంగారావు వంటి వారిని మేం నిర్మాతల చరిత్ర పుస్తకాన్ని ప్రచురించేటప్పుడు సంప్రదించి సెప్టెంబర్ 15గా నిర్ణయించాం. అప్పట్లో ఒకే ప్రింటు ఉండేది కాబట్టి మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చు. ఇవన్నీ పరిశోధనలో తేలాలి. ఈ వాద‌న‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఇక‌నుండి ప్ర‌తీ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 15 న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చ‌ల‌న‌చిత్ర దిఓత్స‌వంగా జ‌రుపుకోవ‌డానికి సినిమా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు నిర్ణ‌యించారు. వ‌చ్చే సంవ‌త్స‌రం నుండి సెప్టెంబ‌ర్ 15న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సెల‌వు ప్ర‌క‌టించి ఆ రోజున ప‌లు కార్య‌క్ర‌మాల‌ని రూపొందింది ఘ‌నంగా జ‌రిపుకుంటామ‌ని అన్నారు.
ఆనాటి నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నుంచి నేటి జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగ‌చైత‌న్య వ‌ర‌కు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ దిన ది ప్ర‌వ‌ర్త‌మాన‌మ‌వుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి క‌నువిందు చేస్తుంది. క‌ష్ట, న‌ష్టాలు ఎన్ని వ‌చ్చినా ఔత్సాహికులు నిర్మాత‌లుగా చిత్రాల‌ని రూపొందిస్తూనే ఉన్నారు. భార‌త‌దేశంలోనే అత్య‌ధిక చిత్రాల‌ను నిర్మించే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌గా తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌కి గుర్తింపు ఉంది. అయితే కొద్ది సంవ‌త్స‌రాలుగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ న‌ష్టాల‌కు గుర‌వుతూ వ‌స్తోంది. ఎన్ని సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌రైన స‌క్సెస్‌లు రాబ‌ట్టుకోవ‌డం గ‌గ‌నంగా మారింది. మ‌రి వ‌చ్చే సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కైనా టాలీవుడ్ నుండి మంచి చిత్రాలు రావాల‌ని, ఆ చిత్రాలు విజ‌య‌వంతం కావాల‌ని ఆశిస్తూ చ‌ల‌న చిత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌తి ఒక్క‌రికీ 5 ఎఎం.న్యూస్ డాట్ కామ్ శుభాకాంక్ష‌లు అందిస్తోంది.
సిహెచెస్కే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!