నార్త్ ఇండియాలో భూకంపం


ఉత్తర.. ఈశాన్య భారతదేశం వణికిపోయింది. సిక్కీం కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. సిక్కీంతో పాటుగా.. నార్త్ ఇండియాలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా.. స్వల్పంగా భూమి కంపించించింది. అలాగే కోల్ కతా, పాట్నా, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అసోంలో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా.. గ్యాంగ్ టక్ కు వాయువ్యంగా ఉన్న పర్వతం శ్రేణుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే భూకంపం వల్ల ఆయా రాష్ట్రాల్లోని జనం భయాందోళనలకు గురయ్యారు. కాగా సిక్కీంలో కాసేపట్లోనే మరోసారి భూ ప్రకంపనలు వచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సంఘ‌ట‌న‌లో ఎటువంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని స‌మాచారం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!